hyderabadupdates.com movies కేసీఆర్‌ కావాల‌నే మౌనంగా ఉన్నారా?

కేసీఆర్‌ కావాల‌నే మౌనంగా ఉన్నారా?

తెలంగాణ రాష్ట్ర సేన‌.. అంటూ టీఆర్ ఎస్ పార్టీని స్థాపించిన క‌విత వ్య‌వ‌హారంపై బీఆర్ ఎస్ నాయ‌కులు మౌనంగా ఉన్నారు. అస‌లు ఏం స్పందించాలి? ఎలా స్పందించాలి? అనే విష‌యంపై వారు త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతున్నారు. ఇత‌ర విష‌యాలు.. మ‌రేత‌ర విమ‌ర్శ‌లు చేసినా స్పందించాల్సిన‌ అవ‌స‌రం ఉండేది కాదు. కానీ.. నేరుగానే కేసీఆర్‌ను విమ‌ర్శించ‌డం.. మారిన మ‌నిషి-మ‌ర మ‌నిషి అని క‌విత వ్యాఖ్యానించడం పై స‌మాజంలో చ‌ర్చ సాగుతోంది.

దీనికి కౌంట‌ర్ ఇవ్వాల‌న్న‌ది బీఆర్ ఎస్ పార్టీలోని సీనియ‌ర్లు త‌హ‌త‌హ‌లాడుతున్నారు. కానీ.. ఎందుకో ఎవ‌రూ స్పందించ‌లేదు. శ‌నివారం పార్టీ స్థాపించిన‌ట్టు ప్ర‌క‌టించిన క‌విత‌.. ఆదివారం మీడియా ముందుకు రావొచ్చ‌ని స‌మాచారం వ‌చ్చినా.. ఆమె కూడా మౌనంగా ఉన్నారు.

తాను చేసిన వ్యాఖ్య‌ల‌పై బీఆర్ ఎస్ నుంచి ఎలాంటి రియాక్ష‌న్ రాక‌పోవ‌డం.. ఊహించ‌ని విధంగా బీజేపీ, కాంగ్రెస్‌లు.. త‌న పార్టీని స్వాగ‌తించ‌డం వంటివి క‌నిపించాయి. అయినా.. క‌విత మీడియా ముందుకు వ‌స్తార‌ని.. ఆదివారం పెద్ద ఎత్తున చ‌ర్చ సాగింది.

ఇదిలావుంటే.. క‌విత వ్య‌వ‌హారంపై స్పందించ‌క‌పోతే.. రాష్ట్రంలో ప్ర‌త్యామ్నాయ పార్టీ ఏర్పాటును బీఆర్ ఎస్ స్వాగ‌తించే పరిస్థితిలో లేద‌న్న వాద‌నను తెర‌మీదికి తెచ్చేందుకు ప్ర‌త్య‌ర్థులు చెబుతున్నారు. వాస్త‌వానికి ఏ పార్టీకి ఆ పార్టీ ఈ విష‌యంలో నిర్ణ‌యం తీసుకుంటుంది. కానీ, మాజీ సీఎం కుమార్తె నేరుగా వ్యాఖ్య‌లు చేయ‌డంతో ఇప్పుడు దానిపై కూడా బీఆర్ ఎస్ మౌనంగా ఉండ‌డం.. ఎవ‌రూ స్పందించ‌క పోవ‌డం కూడా సంచ‌ల‌నంగా మారింది.

రెండు కార‌ణాలు..

క‌విత పార్టీ విష‌యంలో బీఆర్ ఎస్ నాయ‌కులు స్పందించ‌క పోవ‌డంపై ప‌రిశీల‌కులు, విశ్లేష‌కులు రెండు రీజ‌న్లు చెబుతున్నారు. 1) తాము స్పందిస్తే.. మ‌రింత ఎటాక్ పెరుగుతుంద‌న్న ఉద్దేశం: రాజ‌కీయాల్లో స‌హ‌జంగానే మాట‌కు మాట ఎదురొస్తుంది. క‌విత ఈ విష‌యంలో రెండాకులు ఎక్కువ‌గానే చ‌దివింది. సో.. అందుకే బీఆర్ ఎస్ మౌనంగా ఉంద‌ని భావిస్తున్నారు.

2) కేసీఆర్ ఉద్దేశ పూర్వ‌క మౌనంతో క‌విత‌ను ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డేయాల‌న్న వ్యూహం ఉంద‌ని అంటున్నారు. త‌ద్వారా ఆమె ఎన్ని విమ‌ర్శ‌లు చేసినా స్పందించ‌కుండా ఉంటే.. తెలంగాణ స‌మాజ‌మే ఆమెకు స‌మాధానం చెప్పే అవ‌కాశం ఉంటుంద‌ని భావిస్తున్నారు.

Related Post

Mega158 Cast Locked: A Powerful Line-Up Promises a Big-Scale EntertainerMega158 Cast Locked: A Powerful Line-Up Promises a Big-Scale Entertainer

The upcoming Telugu big-budget film Mega158 has generated massive excitement with the official confirmation of its main cast, creating strong buzz across film circles and on social media. The film

నిజాయితీకి సూపర్ స్టార్ సలాం.. పద్మకు రజినీ స్పెషల్ గిఫ్ట్!నిజాయితీకి సూపర్ స్టార్ సలాం.. పద్మకు రజినీ స్పెషల్ గిఫ్ట్!

నేటి రోజుల్లో రూపాయి చేయిజారి కింద పడితేనే వెనక్కి ఇచ్చేవాళ్లు అరుదుగా కనిపిస్తున్నారు. అలాంటిది ఏకంగా రూ.45 లక్షల విలువైన బంగారాన్ని చూసి కూడా ఆశపడకుండా పోలీసులకు అప్పగించి తన నిజాయితీని చాటుకుంది పద్మ అనే పారిశుధ్య కార్మికురాలు. టీ నగర్